హయగ్రీవ జయంతి విశిష్టత
శ్రావణ శుక్ల పౌర్ణమి రోజున హయగ్రీవ జయంతి ని కూడా జరుపుకొంటాం. శ్రీ మహావిష్ణువు హయగ్రీవుడిగా గుఱ్ఱపు తల కలిగిన మానవాకారంగా రూపొందిన పుణ్య దినం. హయ అంటే అశ్వం, గ్రీవ అంటే మెడ అని అర్ధం వస్తుంది. హయగ్రీవుడు చంద్ర మండల నివాసి, మహానందస్వరూపుడు. ఆయన నాసికం నుండి వేదాలు ఆవిర్భవించాయని పురాణ గాథ. శ్రీ మహా విష్ణువు విరాట్ రూపాన్ని ధరించినప్పుడు సత్య లోకం అతడి శిరస్సు, భూలోకం నాభిగా, పాతాళం పాదాలు గా, అంతరిక్షం కన్నుగా, సూర్యుడు కంటి గుడ్డు గా, చంద్రుడు గుండె గా, దిక్పాలకులు భుజాలుగా, సముద్రాలు ఉదరం గా, నదులు నాడులుగా, పర్వతాలు ఎముకలుగా, మేఘాలు కేశాలుగా ఏర్పడ్డాయని పురాణాల ఆధారం గా తెలుస్తుంది. అంటే హయగ్రీవుడు సమస్త దేవతా స్వరూపుడని తాత్పర్యం. హయగ్రీవుడు తెల్లని శరీరం తో లక్ష్మీదేవి ని ఎడమ తొడ పై కూర్చుండబెట్టుకొని తెల్లని పద్మం మీద కూర్చుని ఉంటాడు. అతడి పై కుడి చేతి లో చక్రం, పై ఎడమ చేతి లో శంఖం, కింది ఎడమ చేతి లో పుస్తకం ఉంటాయి. కుడి చేయి చిన్ముద్ర కలిగి ఉంటుంది. వీటి లోని చిన్ముద్ర సమస్త జ్ఞానానికీ, పుస్తకం సమస్త విద్యలకు, శంఖం సకల జగత్ సృష్టి కి కారణభూతమైన నాదానికీ, చక్రం అజ్ఞాన స...